మరో రెండు రోజుల్లో శ్రీలంక మరియు పాకిస్తాన్ లు వేదికలుగా ఆసియా కప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఇందులో ఇండియా, పాకిస్తాన్ , శ్రీలంక , నేపాల్, ఆఫ్గనిస్తాన్ , బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ఇక అన్ని టీం లో కసరత్తులతో సమాయత్తం అవుతున్నాయి. కాగా మరో రెండు రోజుల్లో మ్యాచ్ లు జరగనుండగా శ్రీలంక టీం కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్పీడ్ బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఏకంగా టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. ఇప్పటికే లాహిరి కుమార మరియు చమీర లు గాయాల బారిన పడగా, కొత్తగా మధుశంక సైతం గాయంతో జట్టుకు దూరం కావడం గట్టి దెబ్బ అని చెప్పాలి. ఇక శ్రీలంక టీం తన మొదటి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆగష్టు 31వ తేదీన ఆడనుంది.
ఆసియా కప్ ముందు శ్రీలంకకు బిగ్ షాక్ … !
-