ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం : హరీశ్‌రావు

-

తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో
అధికారంలోకి రావాలని ఆయా పార్టీలు ప్రజలపై హామీలు గుప్పిస్తున్నారు. అయితే.. ఇటీవల ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మంత్రి హరీశ్ రావు్ రావు స్పందించారు. ఈ డిక్లరేషన్‌కు అసలు విలువే లేదన్నారు.

దళితులపై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ కనబరుస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల విద్యుత్ మాత్రమే వస్తుందన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇస్తామని ఉత్త కరెంట్ అమలు చేశారని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ అని చెబుతున్నారన్నారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని మంత్రి హరీశ్ రావు చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలష్ రెడ్డి, ఇతర నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… అసాధ్యమన్న తెలంగాణను కేసీఆర్ సాధించి చూపించారన్నారు. రైతు బంధు, రైతు బీమా సహా అనేక పథకాలు అమలు చేశారన్నారు. నాగర్ కర్నూలుకు మెడికల్ కాలేజీ వస్తుందని కలలో కూడా అనుకోలేదని, ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాకే ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు కాంగ్రెస్ కొబ్బరికాయలు కొడితే తెలుగుదేశం వాళ్లు మొక్కలు నాటారని, కానీ నీళ్లు మాత్రం రాలేదన్నారు మంత్రి హరీశ్ రావు.

ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్‌దే అన్నారు. కల్వకుర్తికి వంద పడకల ఆసుపత్రి బీఆర్ఎస్ వల్లే వచ్చిందన్నారు. కాంగ్రెస్ వాళ్ల డిక్లరేషన్ ఉత్తిత్తిదే అన్నారు. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదన్నారు. ఇక్కడ ఎలాగూ అధికారంలోకి రామని తెలిసి ఇష్టారీతిన హామీలు ఇస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ ప్రజలకు ఏం చేయాలో తెలిసిన నాయకుడు కేసీఆర్ అన్నారు మంత్రి హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version