ASIA CUP: 1984 లో భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయం

-

యూఏఈ వేదికగా ఆసియా కప్ శనివారం నుండి ప్రారంభం కాబోతుంది. గ్రూప్ – ఏ లో ఉన్న భారత జట్టు ఇదే గ్రూపులో ఉన్న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, పసికోన హాంకాంగ్ జట్లతో ఒక్కొక్క మ్యాచ్ నీ గ్రూప్ దశలో ఆడుతుంది. మ్యాచ్ లన్ని భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 గంటలకి ప్రారంభం కానున్నాయి. భారత జట్టు తన మొదటి మ్యాచ్ ని పాకిస్తాన్ తో ఆదివారం ఆడబోతోంది.

ఈ మ్యాచ్ కి దుబాయ్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ రెండు మ్యాచ్లలో గెలిస్తే.. సెప్టెంబర్ 3 నుంచి జరగనున్న సూపర్ ఫోర్ లో భారత్ జట్టు ఆడే అవకాశం ఉంది. ఆఖరిగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న దుబాయ్ లో జరగనుంది. అయితే ఈ ఆసియా కప్ 1984 నుండి నిర్వహణ ఆరంభమైంది. 1984లో యూఏఈ వేదికగానే రౌండ్ రాబిన్ పద్ధతిలో వన్డే ఫార్మాట్ లో ఈ ఈవెంట్ జరిగింది. భారత్, శ్రీలంక, పాకిస్తాన్ పోటీపడ్డాయి. అందులో భారత్ – శ్రీలంక ఫైనల్ చేరాయి.

మొత్తంగా రెండు విజయాలతో టీమ్ ఇండియా విజేతగా నిలిచింది. అందులో శ్రీలంక రన్నర్ కాగా.. పాకిస్తాన్ రెండు మ్యాచ్ లు ఓడి బంగపాటుకు గురైంది. టీమిండియా చేతిలో 54 పరుగుల భారీ లక్ష్యం తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. ఇప్పటివరకు ఆసియా కప్ టోర్నీలో భారత్ – పాకిస్తాన్ మొత్తం 14 మ్యాచ్లలో ముఖాముఖిగా తెలపడ్డాయి. వీటిలో టీమిండియా 8సార్లు గెలవగా.. పాకిస్తాన్ ఐదు మ్యాచ్లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

Read more RELATED
Recommended to you

Latest news