తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అల్లర్లతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్ రాష్ట్రంలో పర్యటనకు వెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటన గురించి అస్సోమ్ సీఎం హిమంత బిస్వా శర్మ మరోసారి రాహుల్ పై విమర్శలు చేశాడు. ఇంతకు ముందు ఒకసారి రాహుల్ పై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ ఇపుడే మణిపూర్ లో హింసతో పరిస్థితులు దారుణంగా మారాయని… ఈ సమయంలో రాహుల్ గాంధీ పర్యటనకు వెళ్లడం సరైన పని కాదని మండిపడ్డారు. ఇప్పుడు ఎవరు మణిపూర్ పర్యటనకు వెళ్లినా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అది మరింతగా పెరుగుతుంది కానీ తగ్గదు అన్నారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే శాంతి జరగాలని కోరుకోవాలి తప్ప… డైరెక్ట్ గా ఆ ప్రదేశానికి వెళ్లడం అంత మంచి చర్య కాదని హిమంత బిస్వా శర్మ సూచించాడు.