ప్రియుడితో పారిపోయింది భార్య. ఈ తరుణంలోనే విడాకులు మంజూరవ్వడంతో పునర్జన్మ లభించిందని 40 లీటర్ల పాలతో స్నానం చేసాడు ఓ భర్త. అస్సాం రాష్ట్రం నల్బాడీ జిల్లా ముకుల్మువా గ్రామంలో భార్యతో విడాకులు మంజూరైన ఆనందంలో వేడుక చేసుకున్నాడు భర్త మాణిక్ అలీ.

తన భార్య రెండు సార్లు ప్రియుడితో పారిపోయి తిరిగి వచ్చిందని, తన బిడ్డ కోసం కలిసి ఉండటానికి ఎంతో ప్రయత్నించానని తెలిపాడు మాణిక్ అలీ. అదే తప్పును పదే పదే కొనసాగించడంతో విసుగు చెంది విడాకులు తీసుకున్నానని తెలిపాడు భర్త. ఇప్పటి నుండి కొత్త జీవితం ప్రారంభిస్తానని దానికి గుర్తుగా పాలతో స్నానం చేశానని తెలిపాడు మాణిక్ అలీ.
https://twitter.com/TeluguScribe/status/1944257884126158897