మేడిపల్లిలోని MLC తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తులు మల్లన్న ఆఫీస్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆఫీస్‌లోని ఫర్నిచర్ మొత్తాన్ని జాగృతి కార్యకర్తలు ధ్వంసం చేశారు.

ఈ క్రమంలో మల్లన్న గన్‌మెన్ 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇది ఇలా ఉండగా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం వెనుక తమ పోరాటాలు ఉన్నాయని కవిత సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు తీన్మార్ మల్లన్న. రావులకు బీసీలకు ఏం పొత్తు…? అంటూ కల్వకుంట్ల కవితపై ఫైర్ అయ్యారు తీన్మార్ మల్లన్న. ఇలాంటి నేపథ్యంలోనే… కల్వకుంట్ల కవిత అనుచరులు… తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేసినట్లు చెబుతున్నారు.
బీసీలతో నీకు మంచం పొత్తు ఉందా అంటూ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
బీసీలకు ఏమొస్తే నీకెందుకు.. నువ్వేమన్న బీసీవా.. కంచం పొత్తు ఉందా.. మంచం పొత్తు ఉందా అంటూ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం https://t.co/4ufUu50WVs pic.twitter.com/UCy5z8ewsJ
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2025