పాక్‌ను సమర్థించిన అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్థాన్‌కు మద్దతు పలికారన్న కారణంగా అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్యేపై దేశదోహ్రం కేసు నమోదు చేసినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లదించారు.

అమినుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించింది ఏఐయూడీఎఫ్. ఉగ్రదాడిపై పాకిస్థాన్‌కు ఎవరు ఎలా మద్దతు పలికినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సీఎం హిమంత. ఈ తరుణంలోనే పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్థాన్‌కు మద్దతు పలికారన్న కారణంగా అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.