ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ ఆమోదం

-

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు అయింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చేందుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం గ్రామ పంచాయతీగా ఉండగా, జిల్లా కేంద్రం పంచాయతీగా ఉండటం కరెక్ట్ కాదని, దాన్ని అభివృద్ధి చేసేందుకు మున్సిపాలిటీగా మారుస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. జనక్పూర్, గోడవల్లి గ్రామాలను మునిసిపాలిటీలో విలీనం చేశారు.

అటు చేపలు పట్టేందుకు మత్స్యకార కులస్తులకే హక్కు కల్పిస్తున్నామని, చెరువుల్లో చేపలు పట్టడానికి ఇతరులకు హక్కు లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ‘చేపల ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. రాయితీపై చేప పిల్లలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. టీఎస్ లో 3.65 లక్షల మందికి మత్స్యకారులుగా సభ్యత్వం ఉంది. కొత్తగా లక్షమంది మత్స్యకారులకు సభ్యత్వం ఇవ్వబోతున్నాం’ అని అసెంబ్లీలో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version