హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.పాతబస్తీలో మెట్రో తీసుకురావడంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. మెట్రో టిక్కెట్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోమని ఇప్పటికే హెచ్చిరించినట్టు తెలిపారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామన్నారు.
హైదరాబాద్‌లో మెట్రో నూతన మార్గాల ఏర్పాటుకు కేంద్రం మోకాలడ్డుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని చిన్న చిన్న నగరాలకు మెట్రో ఏర్పాటుకు కోట్ల నిధులు మంజూరు చేస్తూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరానికి మాత్రం కేంద్రం మొండి చెయ్యి చూపుతోందని ఆయన ధ్వజమెత్తారు.