నయన తార పెళ్లిపై ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..ఆమెకు పెళ్లి అచ్చిరాదు !

-

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో హీరోయిన్ గానే కొనసాగిన ఈ లేడీ సూపర్ స్టార్…. ఆ తర్వాత… లేడీ హీరోగా కూడా సినిమాలు కూడా చేసింది. అయితే.. దర్శకుడు విగ్నేష్‌ శివన్‌-నయన తార ప్రస్తుతం లవ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. 5 సంవత్సరాలుగా… వీరు ప్రేమించుకుంటుండగా.. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే విగ్నేష్‌ శివన్‌-నయన తార పెళ్లి పై ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. నయనతారకు పెళ్లి అస్సలు అచ్చి రాదని… నయనతార జాతకంలో గురువు నీచoలో ఉన్నారని వెల్లడించారు. అందుకే ఆమె వైవాహిక జీవితం అంతా సవ్యంగా సాగదని వివరించారు. ఇదే క్రమంలో ఆయన మిగిలిన స్టార్ హీరోయిన్ అనుష్క అలాగే రష్మిక మందన పెళ్లి పై కూడా స్పందించారు. సమంతకు ఉన్నట్లే గురువు నీచoలో ఉన్నారు అని.. అలా ఉండటం వల్ల సమంతకు ఇలా జరిగిందని తెలిపారు వేణు స్వామి.

Read more RELATED
Recommended to you

Exit mobile version