నెలకు ఒక్క నేతను అయినా బిజెపిలోకి తీసుకువస్తా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

ఇటీవల బీజేపీలో చేరిన తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొదటిసారి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరుతున్న విషయం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు అందరికీ తెలుసు అని కొండా చెప్పారు. తాను ఇన్ని రోజులు తటస్థంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని.. ఇప్పుడు బిజెపిలో చేరే సరికి అంతా అడుగుతున్నారని తెలిపారు.

బిజెపిలో తనకు ప్రాధాన్యత ఇచ్చి చేరికల కమిటీలో అవకాశం ఇచ్చారని.. నెలకు ఒక్క నేతను అయినా బీజేపీలోకి తీసుకొస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. టిఆర్ఎస్ పార్టీ ని అడ్డుకోవడం బీజేపీకే సాధ్యం అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో మూడే నడుస్తున్నాయి, కాళ్ళు మొక్కించుకోవడం, డబ్బులు తీసుకోవడం, కేసులతో బెదిరించడం, ఇవే నడుస్తున్నాయన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు అభినందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version