Raja Vikramarka : లైవ్ లో ప్రపోజ్ చేసిన కార్తికేయ..వీడియో వైరల్

-

ఆర్ఎక్స్‌ 100 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్‌ హీరో కార్తికేయ. ఫస్ట్‌ సినిమాతోనే.. మంచి స్టార్‌ అయ్యాడు. అయితే.. చావు కబురు చల్లగా సినిమాతో… కాస్తా డీలా పడ్డాడు. కానీ గ్యాంగ్‌ లీడర్‌ లాంటి సినిమాల్లో విలన్‌ పాత్రల్లో నటించి.. అందరినీ ఆకట్టుకున్నాడు కార్తికేయ. తాజాగా రాజా విక్రమార్క అనే మరొక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్ తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్రక‌టించిన రోజు నుంచే.. పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రంతో కార్తికేయ బాక్సాఫీస్ క‌లెక్షన్ల వ‌ర్షం కురిపించేలా ఉన్నాడు.

అయితే..నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఓ అరుదైన సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో తన గల్‌ ఫ్రెండ్‌, కాబోయే భార్య లోహితకు కార్తికేయ స్టేజిపైనే ప్రపోజ్‌ చేశాడు. ప్రేమ కోసం తన లైఫ్‌ లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్‌ పెట్టానని చెప్పాడు కార్తికేయ. ఆ అమ్మాయితో ఈ నెల 21వ తేదీన పెళ్లి జరుగనుంది. తన పేరు లోహిత అని కార్తికేయ అందరికీ పరిచయం చేశాడు. ఇక కార్తికేయ ప్రపోజ్‌ చేయడంతో… అతని ఫ్యాన్స్‌ విజిల్స్‌ తో ఆ ఈవెంట్‌ లో సందడి చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news