ప్రపంచంలోనే ఖరీదైన కండోమ్.. గొర్రె ప్రేగుతో తయారీ.. రేటు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

-

సూపర్ మార్కెట్ నుండి మొదలు పెడితే మెడికల్ షాప్ వరకు ప్రతీ దగ్గర కండోమ్ దొరుకుతుంది. చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. ఐతే మీకిది తెలుసా? మొదట్లో కండోమ్ ల వాడకం ధనవంతుల ఇళ్ళలో మాత్రమే ఉండేది. ఒక్కసారి ఊహించండి. 200సంవత్సరాల క్రితం కండోమ్ ధర ఎంత ఉండేదో? మీరు ఊహించను కూడా లేరు. అక్షరాల 44వేల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. దీనిపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనం తెలుసుకుందాం.

కొన్ని రోజుల క్రితం స్పెయిన్ లోని చిన్న నగరంలో ఒక పెట్టె దొరికింది. ఆ చిన్న పెట్టెలో ఏముందా అని తీసి చూస్తే కండోమ్ కనబడింది. 19సెంటిమీటలు ఉన్న ఆ కండోమ్ ని చూసి అందరూ షాకయ్యారు. దాన్ని ప్రయోగశాలలో టెస్ట్ చేస్తే అది 200సంవత్సరాల క్రితం నాటిది అని తెలిసింది. అదీగాక దాన్ని గొర్రె పేగుతో తయారు చేసినట్లు చెప్పారు. పురాతన కాలం నాటిది కావడంతో వెంటనే వేలానికి పిలిచారు. ఈ వేలానికి చాలామంది వచ్చారు. ఆన్ లైన్ వేదికగా జరిగిన ఈ వేలంలో చాలామంది పాల్గొన్నారు.

200సంవత్సరాల క్రితం నాటి కండోమ్ ని సొంతం చేసుకోవడానికి వేలంలో తమ పాట వినిపించారు. చివరికి ఆమ్ స్టర్ డామ్ కి చెందిన వ్యాపారవేత్త ఆ కండోమ్ ని దక్కించుకున్నాడు. పురాతన కాలంనాటి కండోమ్స్ మ్యూజియంలో మాత్రమే కనిపిస్తాయి. అలాంటిది వేలంలో దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ కండోమ్, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి కాలం నాటి కండోమ్ లు కనీసం 15సెంటిమీటర్ల పొడవు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version