సిద్ధిపేటలో దారుణం..బాలిక,మహిళపై లైంగికదాడి!

-

సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటనలు ఒక్కసారిగా వెలుగుచూశాయి. హుస్నాబాద్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు.ఈ ఘటన రెండ్రోజుల కింద జగరగా బాధితురాలు సోమవారం రాత్రి తన తల్లికి చెప్పగా..పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు బాలిక కుటుంబం నివసించే కాలనీకి చెందినవారుగా గుర్తించారు.అనంతరం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు.

మరో ఘటన జిల్లాలోని జగదేవ్ పూర్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళపై ఆటోడ్రైవర్ లైంగికదాడికి తెగబడ్డాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్‌కి మహిళ నడుస్తూ వెళ్తుండగా..ఆటోలో ఆమెను ఎక్కించుకున్న డ్రైవర్ గ్రామానికి సమీపంలో గల నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని నర్సింహులుగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version