మణిపూర్ సీఎం కాన్వాయ్ పై దాడి.. ఇద్దరూ భద్రత సిబ్బందికి గాయాలు

-

జాతి ఘర్షణలు జరుగుతున్న మణిపూర్ లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. ఏకంగా సీఎం బిరేన్ సింగ్ కాన్వాయ్ పైనే దాడి చేశారు. అయితే కాన్వాయ్ లో సీఎం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సోమవారం సందర్శించేందుకు సీఎం బిరేన్ సింగ్ వెళ్లాల్సి ఉంది. అయితే సీఎం పర్యటనకు ముందు భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఓ బృందాన్ని మొదట పంపించారు.

ఇంఫాల్ నుంచి జిరిబామ్ వెళ్లే దారిలోనే కాంగ్పైక్పి జిల్లాలో ఆ వాహనాలపై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. భద్రతా దళాల వాహనాలపై పలుసార్లు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జాతీయ రహదారి-53లోని కోట్లెన్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం జిరిబామ్లో రెండు పోలీసు అవుటోపోస్టులు, ఒక ఫారెస్ట్ బీట్ కార్యాలయం, సుమారు 70 ఇళ్లను మిలిటెంట్లు తగుల బెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం కాన్వాయ్ పై దాడి జరగడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news