KHILADI : “ఖిలాడీ” నుంచి మత్తేంక్కించే సాంగ్‌ రిలీజ్‌..ఇక జాతర షురూ

-

మాస్‌ మహారాజ్‌ రవితేజ..తాజాగా చేస్తున్న మూవీ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఖిలాడీ. రమేష్‌ వర్మ దర్శకత్వంలో.. రూపొందుతన్న ఈ సినిమాను ఏ స్టూడియేస్‌ ఎల్‌ ఎల్పీ పతాకంపై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు.

ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఖిలాడీ సినిమా నుంచి ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి మూడో సింగిల్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. అట్ట సూడకే అంటూ సాగే ఈ సాంగ్‌ లో రవితేజ తన దైన మాస్‌ స్టెప్పులతో.. అందరినీ అలరించాడు. ఈ సాంగ్‌ ను శేకర్‌ మాస్టర్‌ కాంపోజ్‌ చేయడం పాటకు హైలేట్‌ గా మారింది. ఇక ఫిబ్రవరి 11 వ తేదీన.. ఖిలాడీ సినిమా… విడుదల చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version