ప్రేక్షకుల నిర్ణయం ఎప్పుడూ తప్పుకాదు: డైరెక్టర్ కృష్ణవంశీ

-

హనుమాన్’ కంటే ‘శ్రీ ఆంజనేయం’ మూవీనే తనకు నచ్చిందని, ఆ చిత్రం కొందరికి అర్థం కాలేదంటూ తిడుతూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు డైరెక్టర్ కృష్ణవంశీ స్పందించారు. ‘ప్రేక్షకుల నిర్ణయం ఎప్పడూ తప్పు కాదు. వారికి నచ్చలేదంటే ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఆడియన్స్ను విమర్శించొద్దు. నేనే కొన్ని అంశాల్లో తప్పు చేశానేమో’ అని పేర్కొన్నారు. నితిన్, ఛార్మీ జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన ‘శ్రీ ఆంజనేయం’ 2004లో విడుదలైంది.

 

‘శ్రీ ఆంజనేయం’లో హనుమంతుడిగా హీరో అర్జున్, హనుమాన్ భక్తుడు అంజిగా నితిన్ నటించిన సంగతి తెలిసిందే.2004లో విడుదలైన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. హీరోయిన్ పాత్ర లేకపోయింటే ఈ మూవీ హిట్ అయి ఉండేదని అప్పట్లోనే టాక్ వచ్చింది. ఈ చిత్రంలో మాంత్రికుడిగా నటించిన పృథ్వీరాజ్ కూడా ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version