‘మామ ఆరోపణలపై ఇక్కడ స్పందించలేను’.. రవీంద్ర జడేజా భార్య రివాబా

-

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా గురించి తెలియని వారుండరు. ఆయన సతీమణి రివాబా గురించి కూడా చాలా మందికి తెలుసు. ఆమె బీజేపీ ఎమ్మెల్యే. అయితే ఇటీవల రివాబా గురించి జడేజా తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. జడేజాకు రివాబాతో పెళ్లయిన దగ్గర్నుంచి తమ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయని రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సిన్హ్ అన్నారు. ఆస్తులన్నీ ఆమె పేరిట మార్చాలని డిమాండ్‌ చేసిందని, అతడితో పాటు విడిగా ఉండడానికే ఇష్టపడిందని ఘాటు కామెంట్స్ చేశారు. జడేజాకు పెళ్లి చేయకపోయి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

వాటిపై రవీంద్ర జడేజా సోషల్‌ మీడియా వేదికగా స్పందించగా.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న జడేజా భార్య రివాబాకు ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే ఆమె ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా ఇప్పుడు మనం నిర్వహించుకుంటున్న కార్యక్రమం ఏంటి? మీరు ఏదైనా తెలుసుకోవాలంటే నేరుగా నన్నే సంప్రదించండి. ఇక్కడ మాత్రం కాదు’’ అని సమాధానం చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version