Breakup Reasons : ఈ మధ్యకాలంలో ఎన్నో కారణాల వలన చాలా మంది విడిపోతున్నారు. దాంతో బ్రేకప్స్, డివోర్స్ ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇలా విడిపోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడే చూద్దాం… ప్రవర్తన నచ్చకపోవడం వలన చాలా మంది విడిపోతారు. రిలేషన్షిప్ మొదటి నుండి చివరి వరకు వ్యక్తిత్వం ఒకేలా ఉండాలి అని భావిస్తారు. కానీ చిన్న మార్పు వచ్చిన తీసుకోలేరు దాంతో విడిపోవాలని అనుకుంటారు. స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి చెడు అలవాట్లు ఉంటే, ఆ కారణాలతో విడిపోతున్నారు. కొంతమంది రిలేషన్ లో నిజాలను దాయడం, మోసం చేయడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల పార్ట్నర్ పై నమ్మకం అనేది తగ్గిపోతుంది. దాంతో గొడవలు ఎక్కువవుతాయి, విడిపోవాలనే ఆలోచన వస్తుంది.
ఎలాంటి బంధంలో అయినా కోపం కొంతవరకే ఉండాలి. పనిలో ఒత్తిడి లేక ఇతర కారణాల వలన కోపానికి గురైతే ఆ కోపాన్ని ఇంట్లో చూపించకూడదు. ఎప్పుడైతే ఆ నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకొస్తారో అప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. పార్ట్నర్ తో ఎంతో సపోర్టివ్ గా ఉండాలి. ఆనందాన్ని బాధని పంచుకుంటేనే ఏ బంధమైనా బాగుంటుంది. కొంతమంది రిలేషన్షిప్ ఎంత బాగున్న ఇతర ఫ్రెండ్స్ మధ్యలోకి వస్తూ ఉంటారు. దాంతో మరిన్ని గొడవలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా పార్ట్నర్స్ ఇద్దరు పరిష్కరించుకోవాలి. రిలేషన్ లో ఎలాంటి సమస్య వచ్చినా పార్ట్నర్ పై ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండాలి. ఏ సందర్భం వచ్చినా సరే అబద్ధం చెప్పకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒకసారి నమ్మకం కోల్పోతే అభిప్రాయాలు మారిపోతాయి, దాంతో సమస్యలు అంత సులువుగా తొలగిపోవు.