ప్రపంచాన్ని గడగడలాడించి ఎక్కువ సార్లు వరల్డ్ కప్ టైటిల్ ను అందుకుని చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా జట్టుకు గత రెండు పర్యాయాలుగా సరైన ఆటతీరును కనబరచడంతో విఫలం అవుతూ ఉంది. గత వరల్డ్ కప్ లో కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయిన ఆస్ట్రేలియా , ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లోనూ ఆశించిన విధంగా రాణించడంతో బాగా వెనుకబడింది. మొదటి మ్యాచ్ లో ఇండియా పై మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ కేవలం పరుగులు మాత్రమే చేసి దారుణంగా ఓటమి పాలయింది. ఆ తర్వాత ఈ రోజు సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న మ్యాచ్ లోనూ స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదన్నది క్రికెట్ విశ్లేషకుల బలమైన అభిప్రాయం. వార్నర్, మార్ష్, స్మిత్, మాక్స్ వెల్, కమిన్స్ , స్టార్క్ లాంటి ప్రపంచ స్థాయి అఆటగాళ్లు ఉన్నప్పటికీ సరిగా ఆడడంలో విఫలం అవుతోంది.
ఈ వరల్డ్ కప్ లో ఒక్కో జట్టు తొమ్మిది మ్యాచ్ లు ఆడనుండగా ఈ మ్యాచ్ తో పాటు ఉన్న ఎనిమిది మ్యాచ్ లలో కనీసం ఆరు అయినా గెలువకుంటే సెమీస్ బెర్త్ సందేహమే. మరి ముందు ముందు మ్యాచ్ లలో అయినా పుంజుకుంటుందా అన్నది చూడాలి.