చైనా యాప్ టిక్‌టాక్‌కు ఇప్పుడప్పుడే కష్టాలు వదిలే మార్గం కనిపించడం లేదు. భారత్ ముందుగా ఈ యాప్‌పై నిషేధం విధించింది. తరువాత అమెరికా, బ్రిటన్‌లు కూడా టిక్‌టాక్‌లో తమ యూజర్ల డేటా స్టోరేజ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా తాజాగా టిక్‌టాక్‌పై చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. టిక్‌టాక్‌లో స్టోర్ అయి ఉన్న తమ పౌరుల డేటా, వారి ప్రైవసీ, డేటా స్టోరేజ్ భద్రత తదితర అంశాలను పరిశీలిస్తోంది. దీంతో టిక్‌టాక్‌కు ఇంకా భయం పట్టుకుంది.
టిక్‌టాక్ నిజానికి గత కొద్ది వారాల కిందటే ఆస్ట్రేలియాలో తన కార్యాలయాలను ప్రారంభించింది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన టిక్‌టాక్ యూజర్ల డేటా సింగపూర్, అమెరికాల్లో ఉందని.. టిక్‌టాక్ ఆస్ట్రేలియా ప్రతినిధులు చెబుతున్నారు. వారి డేటా అత్యంత భద్రంగా ఉందని హామీ ఇస్తున్నారు. అయినప్పటికీ టిక్‌టాక్‌పై ఆస్ట్రేలియా సూక్ష్మ పరిశీలన చేస్తోంది. ఏవైనా తేడాలు వస్తే వేటు వేసేందుకు ఆస్ట్రేలియా కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
అయితే మరోవైపు టిక్‌టాక్ తన మాతృకంపెనీ బైట్ డ్యాన్స్ నుంచి విడిపోయి లండన్ లేదా అమెరికాలలో తన హెడ్ క్వార్టర్స్‌ను నెలకొల్పే యత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టిక్‌టాక్‌పై ఉన్న చైనా యాప్ ముద్రను తొలగింపజేయవచ్చని టిక్‌టాక్ భావిస్తోంది. అయితే ఈ విషయంలో టిక్‌టాక్ ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి.