ఆస్ట్రేలియా VS ఇండియా: 3 వన్ డేలు , 5 టీ 20లు .. పరుగుల జాతరకు షెడ్యూల్ రెడీ !

-

ఆస్ట్రేలియా మరియు ఇండియా క్రికెట్ టీం ల మధ్యన మ్యాచ్ లు వస్తే చాలు .. ఖచ్చితంగా హోరాహోరీ గా మ్యాచ్ లు జరుగుతాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. కాగా ఆస్ట్రేలియా టీం ఇండియా పర్యటనకు రానున్న షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ సిరీస్ లో భాగంగా మూడు వన్ డేలు మరియు 5 టీ 20 లు క్రికెట్ ప్రేమికులను పిచేక్కించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాసేపటి క్రితమే ఈ సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. మొదటగా వన్ డే లు జరగనుండగా మొదటి వన్ డే సెప్టెంబర్ 22న , రెండవ వన్ డే 24న మరియు మూడవ వన్ డే సెప్టెంబర్ 27న జరగనున్నాయి. ఆ తర్వాత వన్ డే వరల్డ్ కప్ జరగనున్నది… అనంతరం మళ్ళీ అయిదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ జరగనుంది.

నవంబర్ 23 నుండి డిసెంబర్ 3 వరకు వివిధ వేదికలలో ఈ మ్యాచ్ లు జరగబోతున్నాయి. కాగా మొదటి మ్యాచ్ వైజాగ్ లో మరియు చివరి మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version