ఐపిఎల్ నిర్వహణపై ఆస్ట్రేలియా స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జాంపా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఐపిఎల్ మధ్యలోనే తాను వైదొలగాలని నిర్ణయించుకున్నానని, ఎందుకంటే బయో-సేఫ్ బబుల్ అత్యంత హాని కలిగించేదిగా ఉంది అంటూ అతను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత సంవత్సరం మాదిరిగానే యుఎఇలో ఈ టోర్నమెంట్ జరగాలని అతను అభిప్రాయపడ్డాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్ళు అయిన జాంపా మరియు కేన్ రిచర్డ్సన్ వ్యక్తిగత కారణాలను చూపిస్తూ మంగళవారం వెళ్ళిపోయారు.

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ అతను ఈ వ్యాఖ్యలు చేసారు. యుఎఇలో తాను చాలా సురక్షితంగా ఉన్నానని జాంపా చెప్పుకొచ్చాడు. భారత్ లో ఇప్పుడు దారుణంగా పరిస్థితి ఉందని అతను చెప్పుకొచ్చాడు. ఆరు నెలల క్రితం దుబాయ్‌లో జరిగిన ఐపిఎల్‌కు అలా అనిపించలేదని అన్నాడు. అక్కడ చాలా సురక్షితం అని నేను భావించాను అంటూ వ్యాఖ్యలు చేసాడు.