ఇవాళ ఇండియా వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు బంద్

-

ఇవాళ ఆటోలు, క్యాబ్‌లు బంద్కానున్నాయి కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేస్తోంది. అలాగే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తో నష్టపోయిన తమను ఆదుకోవాలని ఆటోడ్రైవర్‌లు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్‌ కు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

Autos and cabs will be closed today

ఇక అటు నేడు భారత్‌ బంద్‌. ఈ బంద్‌ దేశ వ్యాప్తంగా కొనసాగనుంది. కనీస మద్దతు ధరకి చట్టబద్ధతతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఇవాళ గ్రామీణ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. తమ సమస్యలను ప్రజలకు వివరించి, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే భారత్‌బంద్‌కు పిలుపునిచ్చినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version