షాకిస్తున్న అవతార్‌ రన్‌ టైం.. ఎంతంటే..?

-

మరికొన్ని రోజుల్లో విడుదలకు రెడీగా ఉండి ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమా లలో ఒకటి అయినటు వంటి అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ సినిమా థియేటర్‌లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? నీటిలో పండర గ్రహ వాసుల విన్యాసాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలని ఉర్రూతలూగిపోతున్నారు. భారత్‌లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక్కడ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన చాలా అన్ని చోట్ల కూడా చాలా వరకు టికెట్లు అమ్ముడుపోయాయంటే దీని క్రేజ్‌ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రిస్మస్‌ కానుకగా మరో వారం రోజుల్లో అవతార్‌ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది.

అదేంటంటే.. అవతార్‌ 2 సినిమా రన్‌ టైమ్‌. ఈ సినిమా రన్‌ టైమ్‌ 192 నిమిషాల 10 సెకన్లు ఉందంట. అంటే మూడు గంటలకు పైగానే ఉందన్నమాట. 2009లో వచ్చిన అవతార్‌ ఫస్ట్‌ పార్ట్‌ రన్‌ టైమ్‌ విషయానికొస్తే 162 నిమిషాలు ఉంది. అంటే 2 గంటల 42 నిమిషాలు మాత్రమే. కానీ ఫస్ట్‌ పార్ట్‌తో పోలిస్తే సెకండ్‌ పార్ట్‌ నిడివి మరో అరగంట పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలు రావడమే తగ్గిపోయాయి. సరైన స్టోరీ.. విజువల్‌ ఎఫెక్ట్స్‌ బాగున్నప్పుడు మాత్రమే ప్రేక్షకులను సీట్లల్లో కూర్చొబెట్టగలుగుతున్నాయి. లేదంటే సినిమాలు బెడిసికొడుతున్నాయి. మరి జేమ్స్‌ కామెరూన్‌ విజువల్‌ వండర్‌గా వస్తున్న అవతార్‌ 2 సినిమా ప్రేక్షకులను అంతసేపు థియేటర్లలో కూర్చోబెడుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version