నేడు సీబీఐ ఎదుట హాజరు కానున్న అవినాష్ రెడ్డి

-

వివేక్ హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నేడు మరోసారి సీబీఐ ఎదుట హాజరు కానున్నారు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి. సీబీఐ విచారణ హజరుకు మినహాయింపు కోరుతూ తెలంగాణ హై కోర్టులో ఇప్పటికే పిటీషన్ వేశారు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యం లో మినహాయింపు ఇవ్వాలని రాసిన లేఖపై స్పందించింది సీబీఐ.

గతంతో కోర్టు సూచించిన మేరకు నేడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి వెళ్లనున్నారు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి. నిన్న మధ్యాహ్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించు కున్నాక పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్లారు ఎంపి. ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ మరోసారి నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ హై కోర్టు తీర్పు ను రిజర్వు చేసిన నేపథ్యంలో కాస్త దూకుడు తగ్గించింది సీబీఐ.

Read more RELATED
Recommended to you

Exit mobile version