ఆఫ్రికాలోని మలావిలో ‘ఫ్రెడ్డీ’ తుపాను బీభత్సం.. 100 మందికిపైగా మృతి

-

ఆఫ్రికాలోని మలావి దేశంలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. నెల వ్యవధిలో ఫ్రెడ్డీ తుపాను ఆఫ్రికాను అతలాకుతలం చేయడం ఇది రెండోసారి. తుపాను ధాటికి వంద మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇప్పటివరకు 60 మంది మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది.

‘‘మలావిలో ఫ్రెడ్డీ తుపాను పెను బీభత్సం సృష్టిస్తోంది. అక్కడ ఎటు చూసినా నదులు పొంగిపొర్లుతున్నాయి. నీటి ప్రవాహంలో ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి. తుపాను ధాటికి దక్షిణ, మధ్య ఆఫ్రికాలోని ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ వర్షంతో కూడిన గాలులు తీవ్రంగా వీస్తోండడంతో దక్షిణ, మధ్య ఆఫ్రికాలో సహాయక చర్యలు చేపడుతున్న ఎమర్జెన్సీ బృందాలకు ఇబ్బందిగా మారింది. ఎక్కువగా మట్టి నివాసాలే ఉండడంతో అవి ఏ క్షణంలోనైనా కూలిపోయి ప్రజలపై పడే అవకాశం ఉంది’’ అని స్థానిక పోలీసు అధికారి పీటర్‌ ఓ వార్తా సంస్థకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version