అవిశ్వాస తీర్మానం: లోక్ సభలో అధికార, విపక్షాల బలాబలాలివే !

-

ప్రస్తుతం లోక్ సభలో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో హైలైట్ అయిన కొన్ని విషయాలలో మణిపూర్ లో జరిగిన మరియు జరుగుతున్న హింసలపై విపక్షాలు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నాయి. కాగా రెండు మూడు రోజుల నుండి లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని స్పీకర్ ను విపక్షాలు అన్నీ కోరుతున్నాయి. ఇక ఎట్టకేలకు ఇవాళ ఉదయం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానం కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా ఇండియా కూటమి NDA కూటమిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి సిద్ధం అయ్యాయి. ఇందుకోసం కాంగ్రెస్ మరియు BRS ఎంపీలు నోటీసును ఇప్పటికే స్పీకర్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లోక్ సభలో అధికార కూటమి మరియు విపక్షాల కూటములకు ఉన్న బలాలను చూస్తే…

ఎన్డీయే కూటమికి 330 + మంది సభ్యుల బలం ఉంది.. అదే విధంగా ఇండియా కూటమికి 140 + మంది బలం ఉంది.. ఇక ఏ కూటమిలోనూ భాగం కానీ వారు 60 + మంది ఉన్నారు. ఇక ఈ అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలంటే 270 మంది మద్దతు అవసరం. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే బలపరీక్ష ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news