హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ టెంపుల్ లో అద్భుతం జరిగింది. ఆలయంలోని శివాలయంలోకి తాబేలు ప్రవేశించడంతో అందరిని ఆశ్చర్యం గురి చేసింది. ఈ తాబేలు దాదాపు పది సెంటీ మీటర్ల పొడవు, ఆరు సెంటీమీటర్ల వెడల్పున్న ఈ తాబేలు ఎలా ఆలయంలోకి వచ్చిందనే దానిపై స్పష్టత లేదని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం తెలిపారు. ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆయన ప్రధాన పూజారి రంజరాజన్ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇది చాలా శుభసూచకమని, తర్వలోనే కరోనా గురించి ప్రజలు శుభవార్త అందుకుంటారని చెప్పారు.
ఈ కూర్మ మూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తుంది, కూర్మావతారం ఉద్దేశం క్షీరసాగర మథనం. పూర్వం అమృతం కోసం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మరూపంలో వచ్చిన మహావిష్ణువుపైనే మేరు పర్వతాన్ని కవ్వంగా ఉంచి వాసుకి సాయంతో ఒకవైపు దేవతలు, ఒకవైపు అసురులు మదించారు. ఇప్పుడు కూడా కోవిడ్-19పై విజయం కోసం విశ్వమంతా ప్రయత్నం చేస్తుంది.