ఓటీటీ లోకి అయలాన్ తెలుగు వెర్షన్..!

-

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు ఇక్కడ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ ఏడాది సంక్రాంతికి అయలాన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి శివ కార్తికేయన్ వచ్చాడు. తమిళంలో సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అందుకుంది. ఈ సినిమా దాదాపు 97 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. భారీ సక్సెస్ అయ్యింది.

2024లో కోలీవుడ్ లో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది ఓటీటీ లోకి మాత్రం ఆలస్యంగా రాబోతోంది. ఓటీటీ విడుదలపై గతంలో ఎన్నో వార్తలు వచ్చినా కూడా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఈనెల 19న ఓటీడీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మూవీ హక్కులని సన్ నెక్స్ట్ దక్కించుకుందని తెలుస్తోంది అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news