మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేస్తున్న నేతల మీద మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేసారు. బుధవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. బిఆర్ఎస్ టికెట్లు ఇచ్చినప్పటికీ కొందరు కాంగ్రెస్ లోకి వెళ్లి పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు పట్నం సునీత మహేందర్ రెడ్డి దానం నాగేందర్ కడియం కావ్యా రంజిత్ రెడ్డి లకి పార్లమెంట్ ఎన్నికల్లో మూడవ స్థానం అని జోస్యం చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిన హామీలను అమలు చేయట్లేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీ నిరుద్యోగ భృతి అని అన్నారు. హామీలు అమలు చేశారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ మీద అసెంబ్లీలో మేము గట్టిగా కొట్లాడాలంటే పార్లమెంటు ఎన్నికల్లో డిఆర్ఎస్ మెజారిటీ లో సీట్లలో గెలవాలని అన్నారు ఎన్నికల్లో ఓడిపోతేనే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలో అమలు అవుతాయని చెప్పారు.