అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అరవింద్ తల్లి అల్లు కనక రత్నమ్మ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాసేపటి క్రితమే అల్లు కనక రత్నమ్మ అంతక్రియలు కూడా పూర్తయ్యాయి.

అయితే… అల్లు కనక రత్నమ్మ పార్థివ దేహానికి ప్రముఖులు వచ్చి పూలమాలలు వేస్తుంటే… అల్లు అయాన్ అందులో ఒక దాన్ని తన మెడలో వేసుకున్నాడు. అది గమనించిన అల్లు శిరీష్… వెంటనే ఆ పూలమాల తీసేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఒరేయ్ అయాన్ గా 😂🤣 #AlluArjun #Alluayaan pic.twitter.com/Bwv40hmX23
— 𝐑𝐚𝐣 𝐒𝐡𝐢𝐯𝐚 ‘𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬’ (@ImRajShiva) August 30, 2025