అయోధ్యలో ఆగస్టు 5న జరగబోయే రాముడి గుడి భూమిపూజ కోసం అతిథులకు పంపిన ఆహ్వాన లేఖ ఇప్పడు ఆసక్తికర అంశంగా మారింది. చాలా సింపుల్‌గా నిరాడంబరమైన పద్దతిలో ఆహ్వాన పత్రికను అతిథులకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పంపించింది. ఇందులో ప్రధాని మోడీ రాక గురించిన సమాచారం కూడా ఉంది. ఇంతేకాకుండా అతిథులు ఆగస్టు 4న సాయంత్రానికే అయోధ్యకు చేరుకోవాలని ట్రస్ట్ అభ్యర్థించింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి 200 మంది అతిథులను ఆహ్వానిస్తున్నారు. సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, బీజేపీ నేత ఉమా భారతి, రామాలయ ఉద్యమంతో సంబంధం కలిగిన సాధ్వీ రితాంభర, ఇక్బాల్ అన్సారీ తదితరులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 5 న ప్రధాని మోదీ ఉదయం 11.15 గంటలకు సాకేత్ కాలేజీకి చేరుకోనున్నారు.