చాలా మంది వెండితెరపై వెలుగు వెలగాలని అనుకుంటారు. ఇందుకు ఒక్క అవకాశం ముఖ్యమని భావించి.. అవకాశాల కోసం తిరుగుతూనే ఉంటారు. అలా ఒక్కసారి అవకాశం వస్తే చాలు..దానిని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు. అలా బుల్లితెర టు వెండితెర ప్రయాణం సాగించి పదేళ్లు సినీ ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకున్నాడు బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా.
సినిమాల్లోకి రాకముందు టెలివిజన్ హోస్ట్, సింగర్ గా వర్క్ చేసిన ఆయుష్మాన్ ఖురానా.. యాక్టర్ , ప్రొడ్యూసర్ అయిన జాన్ అబ్రహం ప్రొడ్యూస్ చేసిన ‘విక్కీ డోనర్’ ఫిల్మ్ తో బిగ్ సిల్వర్ స్క్రీన్ పైన మెరిశాడు. అలా తొలి చిత్రం విజయం సాధించడంతో జనం హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు ఆయుష్మాన్. ‘విక్కీ డోనర్’ ఫిల్మ్ 2012 ఏప్రిల్ 20న రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత ఆయుష్మాన్ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నారు.
విభిన్న నేపథ్యం ఉన్న కథలను ఎంచుకుని, తనలోని యాక్టింగ్ స్కిల్స్ బయట పెట్టేలా సినిమాలు చేస్తున్నారు. ‘ధమ్ లగా కే హైసా’ పిక్చర్ తో ఆయుష్మాన్ కు నటుడిగా చక్కటి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవడంతో పాటు బాక్సాఫీసు వద్ద సత్తా చాటాయి. ‘అంధాధున్’లో ఆయుష్మాన్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఈ చిత్రాన్ని దాదాపు అన్ని భాషల్లో రీమేక్ చేశారు.
సొసైటీకి మెసేజ్ ఇవ్వడంతో పాటు సొసైటీని ఆలోచింపజేసే ‘ఆర్టికల్ 15’ ఫిల్మ్ తో .. ఆయుష్మాన్ వెర్సటైల్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. సమాజంలో వేళ్లూనుకున్న కులవ్యవస్థను ప్రశ్నిస్తూ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయుష్మాన్. ఆ ‘ఆర్టికల్ 15’ దర్శకుడితో ‘అనేక్’ అనే సినిమా చేశాడు ఆయుష్మాన్. ఈ చిత్రం వచ్చే నెల 27న విడుదల కానుంది. ఆయుష్మాన్ ఖురానా గత చిత్రం ‘చండీగఢ్ కరే ఆషిఖీ’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆయుష్మాన్ ‘డాక్టర్ జీ, యాన్ యాక్షన్ హీరో’ చిత్రాలూ చేస్తున్నారు.