సీఎం జగన్ పబ్జి ఆడటం మానేసి, హోమ్ శాఖపై ఫోకస్‌ చేయాలి – అయ్యన్న పాత్రుడు

-

సీఎం జగన్ పబ్జి ఆడటం మానేసి, హోమ్ శాఖపై ఫోకస్‌ చేయాలని అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. రాష్ట్రంలో తుగ్లక్ సీఎం పరిపాలన్లో అత్యాచారాలు జరుగుతున్నాయని.. మూడేళ్ల లో 800 కు పైగా అత్యాచారాలు జరిగితే పట్టించుకునే నాధుడు లేడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీఎం జగన్ కు టైం లేదు పని లేదని.. 800 కేసుల్లో ఒక్క కేసుకు కూడా న్యాయం జరగలేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో రేపులు జరుగుతుంటే దానికి కారణం చంద్రబాబు అనడం దారుణమని.. అసలు చట్టమే లేని దిశా తో ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం లో పెండింగ్ లో ఉందని.. చట్టమే లేకుండా రాజమండ్రి లో దిశా పోలీస్ స్టేషన్ ను ఓపెన్ చేశారన్నారు.

ముప్పే ఏళ్ల కుర్రాడు, ఆరేళ్ల పాపను రేప్ చేస్తే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చని… నర్సీపట్నంలో వైద్యులు ట్రీట్మెంట్ అవసరం లేదని అన్నారని మండిపడ్డారు. ఇప్పుడు చూస్తే కె జీహెచ్ లో చికిత్స ఇస్తున్నారని.. ఈ బాలికకు మంచి చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సరిగ్గా పరిపాలన చేయడం లేదని… ఈలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version