ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదవులు చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఖాళీగా ఉండాలంటే ఎవ్వరికైనా చాలా బాధగా ఉంటుంది. అయితే దేశంలో ఉన్న యువతకు తగినన్ని జాబులు అందుబాటులో లేకపోయినా, అప్పుడుడప్పుడు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ శాఖలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంటాయి. తాజాగా కొన్ని పోస్ట్ ల రిక్రూట్మెంట్ కోసం ఒక నోటిఫికేషన్ ను DRDO (డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్) సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థలో సైంటిస్ట్ బి విభాగంలో 205 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా ఈ సంస్థ తెలిపింది. కాగా ఈ నోటిఫికేషన్ కు ఆఖరి తేదీ ఆగష్టు 31వ తేదీ వరకు ఉంది.
బి.టెక్ చేశారా … భారీ జీతంతో కొలువులకు నోటిఫికేషన్ !
-