దళితుల అభ్యున్నతికి ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది : కొప్పుల ఈశ్వర్‌

-

పెద్దపల్లి మార్కెట్ యార్డులో శుక్రవారం ఎస్సీ యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటోందని, దళితుల ఆర్థికాభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని కొప్పుల ఈశ్వర్ అన్నారు. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా చిరు వ్యాపారాలు చేసుకునేందుకు దళితులకు రూ.50వేల రూపాయలతో యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

బ్యాంగిల్ షాపులు, పూజ సామాగ్రి దుకాణం, పూల దుకాణం, టీ షాప్ వంటి చిరు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం సహాయం చేసిందన్నారు. దళితుల అభ్యున్నతికి ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గతంలో దళితుల కోసం ఉన్న గురుకుల పాఠశాలలను సీఎం కేసీఆర్ రెట్టింపు చేశారని, గతంలో లేని విధంగా మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రెండో దశ దళిత బంధు కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,100 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు. దళిత ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, తాగు నీటి సరఫరా, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version