శేషాచలం అడవుల్లో దారితప్పిన బీటెక్ స్టూడెంట్స్.. ఒకరు మృతి

-

తిరుపతి జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్న శేషాచలం అడవుల్లోని వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లిన బీటెక్ విద్యార్థులు అనుకోకుండా దారి తప్పారు. ఎలా తిరిగి వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తం ఆరుగురు విద్యార్థులు సరదాగా విహార యాత్రకు వెళ్లినట్లు సమాచారం.

ముందుగా శేషాచలం వాటర్ ఫాల్స్ చూసి తిరిగి వస్తుండగా బీటెక్ విద్యార్థులు అడవిలో దారి తప్పారు. తప్పిపోయిన ఆరుగురిలో అక్కడె ఉన్న వాగులో పడి ఒక విద్యార్ధి మృతి చెందినట్లు సమాచారం. మరో ఐదు గురిని కోడూరు పోలీసులు రక్షించారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వీరంతా ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలు ఇంకా తెలియరాలేదు. మృతుడికి సంబంధించిన వివరాలు సైతం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news