హనుమాన్ మూవీ పై బాహుబలి నిర్మాత ప్రశంసలు

-

ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన  మొదటి సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ సినిమా ప్రీమియర్స్ షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం పలు రికార్డులను బ్రేక్ చేస్తూ.. భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు సైతం ఈ సినిమాకి ఫిదా అయిపోతున్నారు. తాాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ సినిమా చూసి తన ఆనందం వ్యక్తం చేయడమే కాదు.. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇప్పుడే హనుమాన్ మూవీ చూశానని.. ఇది ఒక బ్రిలియంట్ సూపర్ హీరో మూవీ అని చెప్పుకొచ్చారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాని ఎలాంటి తప్పులు లేకుండా తెరకెక్కించాడని కంప్యూటర్ గ్రాఫిక్స్ ని వీఎఫ్ఎక్స్ ని భలే తెలివిగా వాడుకున్నాడని చెప్పుకొచ్చారు. తేజ సజ్జా కూడా బ్రిలియంట్ గా నటించాడని సినిమా మొత్తాన్ని చాలా సులభంగా నడిపించే ప్రయత్నం చేశాడని తెలిపారు. నిరంజన్ రెడ్డి సినిమా నిర్మించనందుకు చాలా సంతోషంగా ఉందని.. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. దీనికి దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందిస్తూ.. ఇది మాకు ఎంతో సంతోషం కలిగించే విషయం సార్.. థాంక్యూ అని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news