గర్భం వచ్చిందని తెలియకుండా ప్రసవం..ఏకంగా విమానంలోనే డెలివరీ !

-

ప్రతి ఒక్కరూ జన్మిస్తారు.. కానీ కొందరు జన్మిస్తూనే అద్భుతాలు సృష్టిస్తారు. అలాంటి ఘటనే ఇదిం. ఓ మహిళ ఏకంగా విమానంలో ప్రసవించింది. ఈ సంఘటన ఈక్వెడార్‌ లో బుధవారం చోటు చేసుకుంది. ఈక్విడార్‌ నుంచి స్పెయిన్ వెళ్తున్న ఓ మహిళ విమానంలోనే ప్రసవించింది.

ఈ విమానంలో ఉన్న సమయంలోనే, తమర అనే మహిళకు కడుపునొప్పి రావడంతో వాష్ రూమ్ కు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే వాష్ రూమ్ లోనే బిడ్డకు జన్మనిచ్చింది ఆ మహిళ. అనంతరం ఆ విమానంలో ఇద్దరు వైద్యులు మరియు సిబ్బంది ఆమెకు సహాయం చేశారు.

డెలివరీ తర్వాత జరుగాల్సిన తతంగాన్ని జరిపించేశారు. విమానం ల్యాండ్ కాగానే ఆసుపత్రికి ఆమెను తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే తమర గర్భం దాల్చినట్టు, బిడ్డ పుట్టే వరకు ఆమెకు తెలియదని డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్ని తమర కూడా చెప్పినట్లు వైద్యులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news