బ్యాడ్ న్యూస్: వర్షం కారణంగా “ఐర్లాండ్ – ఇంగ్లాండ్” మూడవ వన్ డే రద్దు !

-

ఈ రోజు బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్యన జరుగుతున్న మూడవ వన్ డే లో ఐర్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు ఐర్లాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. ఎంతలా అంటే … కేవలం ఎనిమిది ఓవర్ లలోనే 100 పరుగులు పూర్తి చేసి బ్యాటింగ్ లో తమ సత్తా ఏమిటో ఇంగ్లాండ్ నిరూపించుకుంది. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో 31 ఓవర్లకు 280 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయిన దశలో వర్షం పడడంతో మ్యాచ్ ఆగిపోయింది. బెన్ డక్కెట్ (107*) ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (61) మరియు క్రాలీ (51) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇక ఎంతసేపు చూసినా వర్షం ఆగేలా కనిపించకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తూ అంపైరులు నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఈ మూడు వన్ డే ల సిరీస్ లో ఇంగ్లాండ్ 1 – 0 తేడాతో సిరీస్ ను గెలుచుకుంది. ఒకవేళ వర్షం ఆగినప్పటికీ ఇంగ్లాండ్ ఐర్లాండ్ ను భారీ తేడాతో ఓడించి ఉండేది.. ఇక వన్ డే లలో అత్యధిక స్కోర్ కూడా బ్రేక్ అయ్యీ ఛాన్సెస్ ఎక్కువగా ఉండేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version