ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. డీఏ చెల్లింపు వాయిదా..!

-

ఉద్యోగులకి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. మామూలుగా అయితే జూలై నెల నుంచి డీఏ DA ని పెంచుతామని కేంద్రం అంది. కానీ దీనిని ఇప్పుడు పెంచడం లేదు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

డీఏ/ DA

జూలై నెల నుంచి డీఏ పెంపు అమలు ఉంటుందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. డియర్‌నెస్ అలవెన్స్ చెల్లింపును కేంద్రం వాయిదా వేసింది అని పలు నివేదికలు చెబుతున్నాయి.

అయితే ఇప్పుడు డీఏ పెంపు లేదు కనుక ఉద్యోగులకు సెప్టెంబర్ నెల నుంచి డీఏ చెల్లింపులు ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏలను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుతో పాటు ఎరియర్స్ కూడా ఇవ్వొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది కనుక జరిగితే ఉద్యోగులకి రిలీఫ్ గా ఉంటుంది. 2020 జనవరి, 2020 జూలై, 2021 జనవరి.. ఇలా మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డియర్‌నెస్ అలవెన్స్ ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది.

కానీ కరోనా వైరస్ కారణంగా మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులపై, పెన్షనర్లపై ప్రతికూల ప్రభావం పడింది అనే చెప్పాలి. కాగా జూన్ 26, 27 తేదీల్లో డీఏ చెల్లింపు అంశంపై ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో దాదాపు 28 అంశాలు చర్చకు వచ్చాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version