నిన్న సిఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఏపీ కేబినెట్ లో సీఎం జగన్, మంత్రులు మాటలు బాధాకరమని.. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజలు ఉన్నారని నీటి వివాదంపై మాట్లాడటం లేదని అనడం బాధాకరమన్నారు. ఏపీ సర్కారే.. అక్రమ ప్రాజెక్ట్ లు నిర్మిస్తుందని, అనుమతులు లేకుండా పనులు చేస్తుందని…మిగులు జలాలు అని చెప్పి ఉన్న నీటిని తరలించుకు పోయే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పాలమూరు జిల్లాను ఎడారి చేసేందుకు ప్రయత్ని స్తున్నారని..ఉమ్మడి ఏపీలోని ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకోలేదని ఫైర్ అయ్యారు.
ఉద్యమ సమయంలో సీమాంధ్ర నాయకులు రెచ్చగొట్టారని..ఏడేండ్ల తెలంగాణలో ఆంధ్ర ప్రజలు ఒక్కరైనా ఇబ్బంది పడ్డారా? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజలు తెలంగాణ స్వేచ్ఛగా జీవనము సాగిస్తున్నారని…హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర ప్రజలను కంటి రెప్పలా కాపాడుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు..తెలంగాణ ప్రజలు ఏపీలో అవమానాలకు గురయ్యారని..మేము ఏనాడు చెప్పుకోలేదని తెలిపారు.
సీమాంధ్ర ప్రజల మీద మీకు గౌరవం ఉంటే అక్రమ ప్రాజెక్ట్ లు ఆపాలని చిఊరకలు అంటించారు. కృష్ణ బేసిన్ ను కాదని పెన్నా కు నీటిని తరలించడం కరెక్ట్ కాదని.. శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి అపమని చెప్పడం హాస్యాస్పదమన్నారు. శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్ట్….ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ సహించారని హెచ్చరించారు.