రాజకీయాలలో జగన్ వ్యవహరిస్తున్న తీరుపై సన్నిహితులు మరియు కొంత మంది వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు లోలోపల కోప పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీకి చెందిన నాయకుల దాడులను ఎదుర్కొని వైసీపీ పార్టీకి అండగా నిలబడి జగన్ ముఖ్యమంత్రి కావడానికి కృషిచేసిన నాయకులు మరియు కార్యకర్తలు ఇప్పుడు అనవసరంగా పార్టీ అధికారంలోకి వచ్చిందని బాధపడుతున్నారట. పార్టీ కోసం ప్రాణాలు పెట్టి అనేక దాడులను ఎదుర్కొని అధికారంలోకి తీసుకు వస్తే కనీసం జగన్ పట్టించుకోవడంలేదని సొంత పార్టీకే చెందిన వారిపై జగన్ ఈ విధంగా వ్యవహరించడం అన్యాయమని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.
ముఖ్యంగా రాజకీయాలలో జగన్ కి మీడియా పరంగా సరైన సపోర్టు లేని సమయంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గా చేసుకొని టీడీపీకి అండగా ఉండే ఎల్లో మీడియా తప్పుడు కథనాలను సోషల్ మీడియా వైసీపీకి చెందిన ది తిప్పికొట్టింది. వైసిపి పార్టీ అధికారంలోకి రావటానికి జగన్ ముఖ్యమంత్రి అవ్వటానికి గల ప్రధాన కారణాలలో సోషల్ మీడియా కూడా ఒకటని చాలామంది ఓపెన్ గా చెప్పడం జరిగింది. అటువంటిది ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠం లో కూర్చున్న జగన్ సొంత పార్టీ కార్యకర్తలను మరియు అదే విధంగా సోషల్ మీడియా ని కూడా…తనకు మద్దతు ఇచ్చిన వారిని కూడా పక్కన పెట్టినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.
ఇటీవల జగన్ రాజమంహేంద్రవరంలో దిశ పోలీస్ స్టేషన్ ను ఓపెన్ చేయడం తో ఆ సందర్భంలో గతంలో ప్రతిపక్షంలో జగన్ ఉన్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన లోకల్ మీడియా వైసిపి పార్టీ కి పూర్తి మద్దతు తెలిపింది. అయితే తాజాగా దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆ లోకల్ మీడియా అని జగన్ పట్టించుకోకపోవడంతో ఇది తూర్పుగోదావరి వైసీపీ పార్టీ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. దీంతో లోకల్ మీడియా జగన్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కథనాలు రాశాయి. ఏ మీడియా అయితే జగన్ గెలవడానికి కారణం అయ్యిందో ఆ మీడియాలను జగన్ దూరం పెడుతున్నారని, ఇది మంచిది కాదని, ఈరోజు తమకు జరిగినది రేపు మరికొన్ని మీడియా సంస్థలకు కూడా ఇలానే జరిగే అవకాశం ఉంటుందని…ఇలా అయితే చాలా కష్టం జగన్ సారు అని కామెంట్ చేస్తున్నాయి…సదరు మీడియా వర్గాలు.