“ఆధిపురుష్” నిర్మాత ఇంట్లో విషాదం… !

-

“ఆదిపురుష్” పేరుతో రామాయణంలో ఒక భాగాన్ని తీసుకుని ఇప్పటి ప్రేక్షకులకు తెలియచేసే ప్రయత్నం చేశారు. కానీ సినిమా విడుదలయ్యి కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుని మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.కాగా ఈ సినిమాను నిర్మించిన ప్రముఖ నిర్మాత టి సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. భూషణ్ కుమార్ భార్య మరియు నటి అయిన దివ్య ఖోస్లా తల్లి అనిత మరణించారు. ఈమెకు కొద్దీ రోజులుగా ఆరోగ్యం బాగాలేక చికిత్సను అందుకుంటోంది. అయితే పరిస్థితులు చేయి ధాటి పోవడంతో ఈ రోజు అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని కూతురు దివ్య ఇంస్టా గ్రామ్ వేదికగా తన భావాలను పంచుకుంది.

ఈమె ఈ మెసేజ్ లో అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయినప్పటికీ నా హృదయంలో ఎప్పుడూ నిలిచే ఉంటావు, నీ కూతురుగా జన్మించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని ఎమోషనల్ గా రాసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version