సరిగ్గా సంవత్సరాల క్రితం ఇండియాలో జరిగిన 2011 వన్ డే వరల్డ్ కప్ లో ఛాంపియన్ అవడానికి అన్ని అర్హతలున్న ఇంగ్లాండ్ టీం ఐర్లాండ్ లాంటి పసికూన జట్టుపై ఓటమి పాలయింది. ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ఈ మ్యచ్ లో ట్రాట్ (91) మరియు బెల్ (82) లు ఇంగ్లాండ్ కు భారీ స్కోర్ అందించారు. అనంతరం ఐర్లాండ్ ఛేదనలో 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి కి దగ్గరలో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన కెవిన్ ఓబ్రెయిన్ 63 బంతుల్లోనే 113 పరుగులతో సెంచరీ చేసి ఐర్లాండ్ కి చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ఆ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ కనీసం సెమీస్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆఫ్గనిస్తాన్ చేతిలో 69 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఆఫ్గనిస్తాన్ విసిరిన 285 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ముజీబ్, రశీద్, నబి ల స్పిన్ కు తాళలేక మూకుమ్మడిగా విఫలం అయింది. ఇది ఆఫ్గనిస్తాన్ కు అత్యుత్తమ విజయం అని చెప్పాలి, గత వరల్డ్ కప్ లో ఛాంపియన్ గా నిలిచినా ఇంగ్లాండ్ నుండి ఈ తరహా ప్రదర్శన ఎవ్వరూ ఊహించలేదు.