ఏందిది సామీ… ఖాళీ కవర్ 5 ల‌క్ష‌ల‌కు కొంటారా ఎవ‌రైనా..?

-

ఒక్కో విషయంలో ఒక్కోలా జనాలు ప్రవర్తిస్తూ ఉంటారు. వారు ప్రవర్తించే తీరును చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు.. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారని ముక్కున వేలేసుకునే ప‌రిస్థితి. ప్రపంచంలో ఏదో ఒక మూలన నిత్యం అనేక రకాల వేలాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని రకాల వస్తువులకు నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోయే ధరలు రాగా కొన్ని రకాల వస్తువులకు మాత్రం ఆదరణ కరువవుతుంది. అసలు వీటికి ఏం ధర వస్తుందని ఊహించిన వస్తువులు మాత్రం నమ్మశక్యం కాని ధర పలుకుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా జరిగిన వేలంలో సేమ్ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

అట్లాంటీస్ లో జరిగిన వేలంలో ఏమీ వస్తువులు లేని ఓ ఖాళీ కవర్ వేలంలో పెద్ద మొత్తంలో ధర పలికింది. అందరూ ఆశ్చర్యపోయేలా ఓ వ్యక్తి ఆ కవర్ ను దాదాపు 7600 డాలర్ల (5 ల‌క్ష‌లు – Rs 5,64,235) ధర పలికింది. ఇక ఈ ధర చూసిన నిర్వాహకులే విస్తుపోయారు. ఇంతకీ ఆ కవర్ లో అంతలా ఏముందంటే… కేవలం అందులో ఓ ఈవెంట్ వద్ద నింపిన గాలి మాత్రమే ఉంది. అమెరికన్ పాప్ సింగర్ కన్యె వెస్ట్ నిర్వహించిన ఓ షో ప్లేస్ లో గాలి నింపి ఓ వ్యక్తి ఆ కవర్ ను ఆన్ లైన్ వేదిక ఈ బేలో వేలానికి ఉంచాడు. కాగా అనేక మంది వ్యక్తులు ఈ వేలంలో పోటీ పడగా… చివరికి ఆ గాలి నింపిన కవర్ కు ఆశ్చర్యపోయేరీతిలో 5 లక్షల రూపాయల భారీ ధర పలికింది.

Read more RELATED
Recommended to you

Latest news