కరోనా నేపథ్యంలో యాత్రలకు వాయిదా వేశాయి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే, ఛార్ ధామ్ కి వెళ్ళాలనుకునే వారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. దేఖో అప్నా దేశ్ కార్యక్రమంలో భాగంగా ఈ Char Dham Yatra ‘చార్‌ధామ్ యాత్ర’ను ప్రకటించింది.
చార్‌ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్, పూరీ జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకాదీశ్ ప్రాంతాలను ఒకే టూర్‌లో చూడొచ్చు. బద్రీనాథ్‌లో బద్రీనాథ్ ఆళయం, మన గ్రామం, నర్సింఘా ఆలయం, రిషికేషన్ , త్రివేణి ఘాట్, పూరీ, గోల్డెన్ బీచ్, కోణార్క్ దేవాలయం, ధనుష్కోటి, ద్వారకలో ద్వారకాదీష్ ఆలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ, శివ్‌రాజ్‌పూర్ బీచ్, బెట్ ద్వారక సందర్శించొచ్చు.
చార్‌ధామ్ యాత్ర ఢిల్లీలో ప్రారంభమవుతుంది. డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్‌ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ రైల్వే స్టేషన్ లో సెప్టెంబర్ 18న బయలుదేరి… మొత్తం 15 రాత్రులు, 16 రోజులు .. 8500 కిలోమీటర్లను కవర్ చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.78,585.
సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీకి ప్యాకేజీ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. టూర్ ప్యాకేజీలో ఫస్ట్ ఏసీ లేదా సెకండ్ ఏసీ క్లాస్‌లో ప్రయాణం, 6 రాత్రులు డీలక్స్ కేటగిరీ వసతి, 9 రాత్రులు రైలు కోచ్‌లోనే ప్రయాణం, రైలులోని రెస్టారెంట్ అందించే భోజనంతో పాటు పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లలో భోజనం, ఏసీ వాహనాల్లో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్ ్స కవర్ అవుతాయి. కారణంగా టూరిస్టుల సంఖ్యను కూడా తగ్గించింది ఐఆర్‌సీటీసీ. అంతేకాదు.. కోవిడ్ దృష్టిలో పెట్టుకొని టూరిస్టులందరికీ ఫేస్ మాస్కులు, గ్లోవ్స్, శానిటైజర్లను అందిస్తుంది. 18 ఏళ్లు పైబడినవారు ఐఆర్‌సీటీసీ ’చార్‌ధామ్ యాత్ర’ ప్యాకేజీ బుక్ చేయాలంటే కనీసం కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకోవాలి.