శిల్పా చౌద‌రికి బెయిల్.. అయినా జైలులోనే

-

కిట్టి పార్టీల పేరుతో ప్ర‌ముఖుల‌ను చీట్ చేసిన శిల్పా చౌద‌రి కేసులో మ‌రో ట్విస్ట్. చీటింగ్ కేసు లో శిల్పా చౌద‌రికి ఉప్ప‌ర్ ప‌ల్లి కోర్ట్ ఊర‌టను ఇచ్చింది. కొన్ని ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ను ఉప్ప‌ర్ ప‌ల్లి కోర్టు ఇచ్చింది. అయినా.. శిల్పా చౌద‌రి ఇంకా జైలు లో నే ఉంది. అయితే త‌మ‌ను శిల్పా చౌద‌రి రూ. 7 కోట్ల వ‌ర‌కు మోసం చేసింద‌ని ముగ్గురు మ‌హిళ‌లు ఫిర్యాదు చేశారు. దీంతో శిల్పా చౌద‌రి ని పోలీసులు అరెష్టు చేశారు. ఈ కేసులు ఇప్పటి వ‌ర‌కు శిల్పా చౌద‌రిని పోలీసులు విచారించారు.

కాగ దివ్యారెడ్డి అనే మ‌హిళ ఫిర్యాదు చేసిన కేసు విష‌యం లో శిల్పా చౌద‌రి కి ఉప్ప‌ర్ ప‌ల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మిగిత ఇద్ద‌రు మ‌హిళలు చేసిన ఫిర్యాదుల‌కు సంబంధించిన కేసుల విష‌యం లో శిల్పా చౌద‌రికి బెయిల్ మంజూరు కాలేదు. దీంతో శిల్పా చౌద‌రికి బెయిల్ మంజూరు అయినా.. జైలు లోనే ఉండాల్సి వ‌స్తుంది. కాగ ఈ కేసు లో పోలీసులు విచార‌ణ ఇంకా కొన‌సాగిస్తున్నారు. ముఖ్యం గా ఆ మొత్తం డ‌బ్బును శిల్పా చౌద‌రి ఎక్క‌డికి త‌ర‌లించార‌నే అంశం పై పోలీసులు దృష్టి సారించారు.

Read more RELATED
Recommended to you

Latest news