రాహుల్ గాంధీకి ప్ర‌ధాని అయ్యే చాన్స్ ఉంది : ప్ర‌శాంత్ కిశోర్‌

రాజ‌కీయ వ్యూహ క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్ గురించి.. ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న గురించి.. దేశంలోని చాలా మందికి తెలుసు. అయితే.. ప్ర‌స్తుత దేశ రాజ‌కీయాల్లో ప్ర‌శాంత్ కిశోర్… చాలా హాట్ టాపిక్ గా ఉన్నారు. అయితే.. తాజాగా మ‌రోసారి దేశ రాజ‌కీయాల‌పై ప్ర‌శాంత్ కిశోర్ ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ యంగ్ లీడ‌ర్ రాహుల్ గాంధీ ప్ర‌ధాన మంత్రి అయ్యే ఛాన్స్ ఉన్న‌ట్లు… ప్ర‌శాంత్ కిశోర్ తాజాగా కామెంట్ చేశారు.

Political Strategist Prasanth Kishor

కాంగ్రెస్ పార్టీ లేకుండా… ప్ర‌తి ప‌క్ష పార్టీలు… కేంద్రంలో… అధికారం చేప‌ట్ట‌డం చాలా క‌ష్ట‌మ‌ని.. ఆయ‌న స్ప‌స్టం చేశారు. ఓ ఇంగ్లీష్ చానల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిషోర్ ఈ వ్యాక్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌.. చేసిన వ్యాఖ్య‌లు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. గ‌త వారం రోజుల కింద‌ట‌… కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి ఫ‌లితం లేద‌ని… రాహుల్ గాంధీకి ప్ర‌ధాని అయ్యే చాన్స్ లేద‌ని.. ప్ర‌శాంత్ కిశోర్ అన‌డం గ‌మ‌నార్హం.